తొలినాడే 99.80శాతం రైతుల ఖాతాలకు నిధులు...
ABN , Publish Date - Jun 21 , 2026 | 06:46 AM
పీఎం కిసాన్ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ, అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు వేర్వేరుగా విడుదల చేసిన..
మోదీ ప్రసంగాన్ని సభికుల్లో కూర్చొని విన్న సీఎం
అమరావతి, చిలకలూరిపేట, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : పీఎం కిసాన్ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ, అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు వేర్వేరుగా విడుదల చేసిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలకు నగదు జమైంది. శనివారం సాయంత్రం 5గంటల సమయానికే పీఎం కిసాన్ నిధులు 100శాతం, అన్నదాత సుఖీభవ నిధులు 99.80శాతం రైతుల ఖాతాలకు చేరాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఇంకా జమకాని వారికి నాలుగైదు రోజుల్లో చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. కాగా, పశ్చిమబెంగాల్‌లోని తారకేశ్వర్ నుంచి ప్రధాని మోదీ నిధులను విడుదల చేసి ప్రసంగించారు. మోదీ ప్రసంగం పూర్తయ్యే వరకు సీఎం చంద్రబాబు ప్రజా వేదికపైకి వెళ్లలేదు. సభికుల్లో కూర్చొని ప్రధాని కార్యక్రమాన్ని వేదిక వద్ద ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై వీక్షించారు.