వారఫలాలు...ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?
ABN , Publish Date - Jul 26 , 2026 | 07:00 AM
ఈ వారం రాశిఫలాలు.. 26 జూలై - 1 ఆగస్టు 2026 పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. నిర్విరామంగా శ్రమిస్తారు. విశ్రాంతిలోపం, అకాలభోజనం. ఒప్పందాల్లో ఏకాగ్రత వహిం చండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులతో జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. మీ చొరవతో ఒక సంబంధం నిశ్చయమవుతుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. అంచనాలు ఫలి స్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. రశీ దులు, పత్రాలు జాగ్రత్త. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలోభాలకు గురికా వద్దు. ఆహ్వానం అందుకుంటారు. పిల్లలకు శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం సంతృప్తికరం.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరు తుంది. సమర్థతను చాటుకుంటారు. ప్రము ఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగాలి. గిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ప్రతీ విషయం లోను ఆచితూచి అడుగేయాలి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మీయులకు ముఖ్యసమాచారం అందిస్తారు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. పరిస్థితులు నిదానంగా మెరు గుపడతాయి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు ధనం సర్దుబాటవు తుంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి చికాకుపడతారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. సర్వత్రా కలిసివచ్చే సమయం. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. ధనలాభం ఉంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చేస్తున్న పనులపై దృష్టిపెట్టండి. అనుకో కుండా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టు కుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. స్థిరచరాస్తుల ధనం అందుతుంది. విలాసా లకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. గృహమార్పు అనివార్యం. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అనుభవ జ్ఞులను సంప్రదిస్తారు. అనాలోచిత నిర్ణయం తగదు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవు తారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభి స్తుంది. విజ్ఞతతో మెలుగుతారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. రావలసిన ధనం అందుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రియతములతో తరచూ సంభా షిస్తారు. ఒక వ్యవహారం మీ సమక్షంలో సాగుతుంది. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. లక్ష్యం సాధిస్తారు. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. చాకచక్యంగా అడుగు ముందుకేస్తారు. వస్త్రప్రాప్తి, వాహన యోగం ఉన్నాయి. ఇతరుల కోసం విపరీ తంగా ఖర్చుచేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సామరస్యంగా మెలగండి. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతోముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అంది పుచ్చుకోండి. చేపట్టిన పనుల్లో శ్రమ, ఒత్తిడి అధికం. ఖర్చులు అదుపులో ఉండవు.ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. విశ్రాంతిలోపం, అకాల భోజ నం. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. ఒంటెద్దు పోకడ తగదు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ప్రతికూలతలతో సతమతమ వుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే చికాకుపడతారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టిం చుకోవటం శ్రేయస్కరం. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సామ రస్యంగా సమస్య పరిష్కరించుకోండి. ఆత్మీ యుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అనుకున్న కార్యం నెరవేరు తుంది. లక్ష్యానికి చేరువవుతారు, యత్నాలకు అయినవారి ప్రోత్సాహం ఉంటుంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు త్వరి తగతిన సాగుతాయి. నగదు, ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. పిల్లల దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అనురాగవాత్సల్యాలు వెల్లివిరు స్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచ యాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యతిరే కులు సన్నిహితులవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ప్రతీ విష యంలోనూ అప్రమత్తంగా ఉండాలి. పోయా యనుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News