కుటుంబానికి అమ్మే సీఈవో
ABN , Publish Date - Jul 26 , 2026 | 06:06 AM
కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించే తల్లే కుటుంబానికి నిజమైన సీఈవో అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. ఇదే భావనతో రచయిత భోగాడి ఉదయమూర్తి రాసిన..
మంచి పుస్తకాలే వ్యక్తిత్వ వికాసానికి పునాది: గవర్నర్ శుక్లా
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించే తల్లే కుటుంబానికి నిజమైన సీఈవో అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. ఇదే భావనతో రచయిత భోగాడి ఉదయమూర్తి రాసిన ‘ద సీఈవో షీ నెవర్ న్యూ షీ వాజ్’ పుస్తకం సమాజానికి స్ఫూర్తినిచ్చే ఆలోచనను ముందుకు తెచ్చిందని కొనియాడారు. లోక్‌భవన్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంతో పాటు హైదరాబాద్ స్టార్టప్ ఎకో సిస్టమ్స్ అవార్డ్స్-2026 ప్రధానోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి పుస్తకాలు వ్యక్తిత్వ వికాసానికి, ఆలోచనల పరిపక్వతకు దోహదపడతాయన్నారు. పుస్తకం హస్తభూషణం అనే భావనను నేటి తరం అలవరచుకోవాలని, సోషల్ మీడియాలో చెడు వైపు వెళ్లే బదులు మంచి పుస్తకాలను చదవాలని సూచించారు. హైదరాబాద్ స్టార్టప్ ఎకో సిస్టమ్స్ అవార్డ్స్‌లో భాగంగా... వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందికి గవర్నర్ అవార్డులు అందజేశారు.