బతుకుదెరువుకు వచ్చి డ్రగ్స్ విక్రయం
ABN , Publish Date - Mar 06 , 2026 | 09:02 AM
నగరంలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులున్న ముఠాను సిటీ సీసీఎస్, అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు.
ముఠా అరెస్ట్
72 గ్రాముల ఎండీఎంఏ సీజ్
హైదరాబాద్ సిటీ: నగరంలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులున్న ముఠాను సిటీ సీసీఎస్, అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు. సీసీఎస్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ను నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి.. జీడిమెట్ల వినాయకనగర్(Jeedimetla Vinayakanagar)లో ఉంటున్న జోగ్‌సింగ్, అఫ్జల్‌గంజ్ చుడీబజార్‌లో ఉంటున్న చునారామ్ చౌదరి (27), కూకట్‌పల్లిలో ఉంటున్న అమృత్ పురోహిత్ (32). చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
నగరంలో మాదక ద్రవ్యాలకు డిమాండ్ ఉండటంతో అడ్డదారిలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న వీరు ముఠాగా ఏర్పడ్డారు. ఇతర నగరాల నుంచి తక్కువ ధరకు ఎండీఎంఏ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈనెల 4న బషీర్‌బాగ్‌లోని పీజేఆర్ విగ్రహం వద్ద కస్టమర్స్ కోసం వేచి చూస్తున్న క్రమంలో సమాచారం అందుకున్న సీసీఎస్, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
వారి నుంచి 72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 4 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ (డీడీ) ఎస్. చైతన్య కుమార్, ఏసీపీ (స్పెషల్ క్రైమ్ టీమ్) జి. వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ డి. భిక్షపతి టీమ్, అబిడ్స్ పోలీసులు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారని, వారిని అభినందిస్తున్నట్లు అడిషనల్ సీపీ శ్రీనివాస్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్‌ఎస్ విఫలం
Read Latest Telangana News and National News