ఫోన్‌లో గేమ్ ఆడొద్దంటూ తల్లి మందలింపు.. అలిగి ఇల్లు వదిలివెళ్లిన ముగ్గురు పిల్లలు
ABN , Publish Date - Jun 23 , 2026 | 09:14 AM
సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడొద్దంటూ తల్లి తన ముగ్గురు పిల్లల్ని మందలించింది. దీంతో ఇల్లు వదిలి వెళ్లారు.
ఫలక్‌నుమా ఎక్స్ప్రెస్లో ఉన్నట్లు గుర్తింపు
ఏలూరు వద్ద అదుపులో తీసుకొన్న పోలీసులు
ఆఖరికి తల్లిదండ్రుల చెంతకు
హైదరాబాద్: సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడొద్దంటూ తల్లి తన ముగ్గురు పిల్లల్ని మందలించింది. దీంతో ఇల్లు వదిలి వెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రమించి వారి చెంతకు చేర్చగా కథ సుఖాంతమైంది. ఈ సంఘటన బీబీకా చష్మా ప్రాంతంలో వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్ జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం... ఈ ప్రాంతంలో దంపతులు, ముగ్గురు పిల్లలు నివాసముంటున్నారు. చిన్నారులు సెల్ ఫోన్‌లకు వివపరీతంగా అలవాటు పడటంతో మందలించింది. దాంతో అలిగిన వారు తల్లికి చెప్పకుండా ఇంటి నుంచి ఆదివారం ఉదయం వెళ్లిపోయారు.
ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో ఫలక్‌నుమా పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఫలక్‌నుమా ఎక్స్‌పెస్ రైలు ఎక్కినట్లు తెలుసుకొన్నారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, ఫలకనుమా ఏసీపీ జివీద్‌లు.. రైల్వే పోలీసులకు, ఏపీ పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఏలూరులో వారిని అదుపులోకి తీసుకొని సోమవారం ఉదయం తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి కరెంట్ కట్
Read Latest AP News And Telangana News And International News And Telugu News