Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Jun 23 , 2026 | 07:41 AM

హైదరాబాద్ నగరం బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి కరెంట్ కట్
Hyderabad Power Cut Today

హైదరాబాద్: హైదరాబాద్ నగరం బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమాన్‌ టెంపుల్‌, టీజీపీఎస్సీ కమాండెంట్‌ కార్యాలయం ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, ఉదయం 10 నుంచి ఉదయం 10:45 గంటల వరకు కళింగ ఫంక్షన్‌ హాల్‌ ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు గ్రీన్‌బంజారాకాలనీ ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌ .13లోని కలెక్టర్‌ బంగ్లా, సవేరా ఫంక్షన్‌హాల్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ విద్యుత్‌ ఉండదని ఆయన తెలిపారు. అలాగే, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌.12లోని కనకదుర్గ టెంపుల్‌ ఫీడర్‌ పరిధిలోని ప్రాంతాల్లోనూ, సాయంత్రం 4 నుంచి 4:30 గంటల వరకు ఎన్‌.బి.టి.నగర్‌ ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలో..

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌.వి.సత్యనారాయణ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గణేశ్‌నగర్‌, బీకేగూడ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భరత్‌నగర్‌, ఎస్‌.ఆర్‌.నగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


కేపీహెచ్‌బీకాలనీ: వసంతనగర్‌, కేపీహెచ్‌బీ సెక్షన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం శుక్రవారం పలు ప్రాంతాల్లో వి ద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈలు ఇంద్రసేనా రెడ్డి, బొనిగాల విజయప్రకాష్‌ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వసంతనగర్‌లో.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోకుల్‌ప్లాట్స్‌ (వెంకటరమణ కాల నీ) ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు. కేపీహెచ్‌బీ పరిధిలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రవి హాస్పిటల్‌, ప్రసాద్‌ హాస్పిటల్‌, ధనలక్ష్మీ సెంటర్‌, ఈడబ్ల్యూఎస్‌, శివాలయం, ఎల్‌ఐజీ, రోడ్డు నంబర్‌-2, రోడ్డు నంబర్‌-3 ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హనుమాన్‌ టెంపుల్‌, మయూరి ఎస్టేట్‌, నాలుగోఫేజ్‌ రోడ్డు, చౌదరి మెస్‌, వాటర్‌ ట్యాంక్‌, శ్యాం ముఖర్జీ పార్కు ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు.


చిక్కడపల్లి: హైదరాబాద్‌ సిటి-1, ఆజామాబాద్‌ డివిజన్ల పరిధిలో మంగళవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు వినోద్‌కుమార్‌, నరేంద్రరాజు తెలిపారు. అశోక్‌నగర్‌, కపాడియా, అవంతినగర్‌ బౌద్ధనగర్‌, ఎల్‌ఎన్‌నగర్‌, దయారామార్కెట్‌, వీఎస్టీ, కమలానగర్‌, కృష్ణానగర్‌, జిందాతిలిస్మాత్‌, ప్రాంతాల పరిధిలో ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటలవరకు, గోశాల, జాఫర్‌అలీబాగ్‌, ఏపీఎ్‌సఈబీ, కమిషనర్‌ ఆఫీస్‌, సంజీవయ్యనగర్‌, శివాలయం, బసంత్‌ కాలనీ, వైఎంసి, ఆర్‌వోం ప్రాంతాల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదు.


చంపాపేట: మరమ్మతులు, చెట్ల కొమ్మల నరికివేత కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని చంపాపేట సబ్‌స్టేషన్‌ ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉదయ్‌నగర్‌, పద్మానగర్‌, గాయత్రినగర్‌ ఎక్స్‌రోడ్‌, మందమల్లమ్మ ఎక్స్‌రోడ్‌, కర్మన్‌ఘాట్‌, మైత్రిపురం కాలనీ, క్రాంతినగర్‌, లక్ష్మీనగర్‌ కాలనీల్లో, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీనివాసనగర్‌, సాయిరాంనగర్‌, తపోవన్‌ కాలనీ, గ్రీన్‌ పార్కు కాలనీల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు.


సరూర్‌నగర్‌ డివిజన్‌లో..

సంతోష్‏నగర్‌: చెట్ల కొమ్మల నరికివేత కారణంగా సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలిండియా రేడియో, సౌత్‌ ఎండ్‌ పార్క్‌, హనుమాన్‌నగర్‌, గణేష్‏పురి, ప్యారడైజ్‌ విల్లాస్‌, చిత్రా లే అవుట్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీర్‌ పార్క్‌, రాక్‌టౌన్‌, దుర్గానగర్‌, అష్టలక్ష్మి ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌లో..

సైదాబాద్‌: ఆస్మానఘడ్‌ డివిజన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్మాన్‌ఘడ్‌, సాదత్‌నగర్‌, పల్టన్‌, ఎమ్మారో ఆఫీస్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జీఏ బ్యాంకు కాలనీ, జడ్జస్‌ కాలనీ, సలీంనగర్‌, బడా బజార్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని డీఈ విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు.

ఏఎస్‏రావునగర్‌: ఏఎస్‏రావునగర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని మజీద్‌, మారుతీనగర్‌ 11 కేవీ ఫీడర్‌లలో సాంకేతిక మరమ్మతుల కారణంగా మంగళవారం పలు కాలనీలలో విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఈ వేముల గంగాభవాని తెలిపారు. శ్రామికనగర్‌, రావుస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్‌ నం. 1,2,3,4,5, మారుతీనగర్‌ ప్రాం తాలలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, క్రియేటివ్‌నగర్‌, ప్రగతి నగర్‌, సాయినాధపురం, శ్రామికనగర్‌, మారుతీనగర్‌ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ కోత విధిస్తున్నట్లు ఏఈ గంగాభవాని పేర్కొనారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని ఆమె కోరారు.


వాయుపురి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో..

నేరేడ్‌మెట్‌: నేరేడ్‌మెట్‌లోని వాయుపురి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని అంబేడ్కర్‌నగర్‌ 11 కేవీ ఫీడర్‌ పరిధిలో చెట్ల కొమ్మలు నరికివేత, నిర్వహణ పనులు కారణంగా ఈ కింది ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ లత తెలిపారు. మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యహ్నం ఒంటి గంట వరకు అంబేడ్కర్‌నగర్‌, టెలికాంకాలనీ, వినోబానగర్‌, తదితర ప్రాం తాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు మధురానగర్‌, నేరేడ్‌మెట్‌ మెయిన్‌ రోడ్డు, శ్రీకాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని ఆమె కోరారు.


పర్వతాపూర్‌ పరిధిలో..

పీర్జాదిగూడ: పర్వతాపూర్‌ పరిధిలోని పలు కాలనీలలో మంగళవారం విద్యుత్‌ సరపరాలో అంతరాయం కలుగనున్నట్లు ఏఈ సత్యనారాయణ తెలిపారు. 11 కేవీ సత్యనారాయణ ఫీడర్‌ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వెంకటరమణా పురం, సత్యనారాయణ పురం, సాయి అశ్వర్య కాలనీ, పర్వాతాపూర్‌ ఓల్డ్‌ విలేజ్‌, సాయి మహదేవ్‌ నగర్‌, ఇంద్రాప్రస్థా ఎన్‌క్లేవ్‌లలో అలాగే 11 కేవీ విష్ణుపూరి ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2:30 నిమిషాల నుంచి 5:30 నిమిషాల వరకు విష్ణుపూరి కాలనీ, లేక్‌వ్యూ కాలనీ, భవానీ నగర్‌, పన్నాల ఎన్‌క్లేవ్‌, సాయికృష్ణా నగర్‌ ఫేజ్‌ 1,2, వినాయక్‌ నగర్‌, సాయి అశ్వర్య కాలనీ రోడ్‌ నంబర్‌ 1,6, హరిణీ మ్యాన్‌షన్‌, సత్యనారాయణ పురం రోడ్‌ నంబర్‌ 6లో విద్యుత్‌ అంతరాయం కలగనున్నట్లు ప్రజల సహకరించాలని కోరారు.


రాయదుర్గం: ఖాజాగూడ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శివకృష్ణప్రసాద్‌ తెలిపారు. ఖాజాగూడ గ్రామం, ఖాజాగూడ మెయిన్‌రోడ్‌, వీకర్‌సెక్షన్‌ కాలనీ, వజ్ర అపార్ట్‌మెంట్స్‌, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని పేర్కొన్నారు.


శాంతినగర్‌ ఫీడర్‌ పరిధిలో..

శాంతినగర్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో విద్యుత్‌ లైన్ల మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శాంతినగర్‌, చందానగర్‌, గంగారంలో విద్యుత్‌ ఉండదని అధికారులు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు చందానగర్‌ మెయిన్‌రోడ్డు, చందానగర్‌ టెంపుల్‌ ప్రాంతంలో విద్యుత్‌ ఉండదన్నారు.


గచ్చిబౌలిలో..

గచ్చిబౌలి: పోలీస్‏స్టేషన్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా అడ్డగుట్ట, సమతానగర్‌, జలవాయువిహార్‌ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు అడ్డగుట్ట రోడ్డు నెంబర్‌ 1-9 వరకు విద్యుత్‌ ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బ్రెయిన్‌ ట్యూమర్‌ మరణశాశనం కాదు

వాట్సాప్‌ గ్లోబల్‌ హెడ్‌గా కునాల్‌ షా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 07:41 AM