Share News

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ సారి ఎంతంటే..

ABN , Publish Date - Apr 03 , 2026 | 06:40 AM

గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,48,970 దగ్గర.. 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,36,550 దగ్గర.. 18 క్యారెట్ బంగారం ధర రూ.1,11,730 దగ్గర ట్రేడ్ అయింది.

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ సారి ఎంతంటే..
gold prices today

బంగారం ధరలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లలో అస్థిరత్వం నెలకొంది. ఈ అనిశ్చితి కారణంగా చమురు, బంగారం ధరలపై గణనీయమైన ప్రభావం పడుతోంది. యుద్ధం ప్రారంభం అవడానికి ముందు 1.90 లక్షల రూపాయల దగ్గర ట్రేడ్ అయిన 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం.. ఇప్పుడు 1.48 లక్షల రూపాయలకు పడిపోయింది. బంగారం ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. అమెరికా డాలర్ విలువ పెరగటం వల్ల కూడా బంగారం ధరలు ప్రభావం అవుతున్నాయి.


హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు..

గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,48,970 దగ్గర.. 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,36,550 దగ్గర.. 18 క్యారెట్ బంగారం ధర రూ.1,11,730 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు (శుక్రవారం ఉదయం) 24,22,18 క్యారెట్ గోల్డ్‌‌పై 10 రూపాయల చొప్పున తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,48,960 .. 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,36,540 .. 18 క్యారెట్ బంగారం ధర రూ. 1,11,720లుగా ఉంది.


ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

  • హైదరాబాద్: 1,48,960

  • విజయవాడ: 1,48,960

  • విశాఖపట్నం: 1,48,960

  • ముంబై: 1,48,960

  • బెంగళూరు: 1,48,960

  • ఢిల్లీ: 1,49,110

  • చెన్నై: 1,49,990

  • సూరత్: 1,49,010


గమనిక: పైన పేర్కొన్న బంగారం రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ఇవి కూడా చదవండి

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!

Updated Date - Apr 03 , 2026 | 06:48 AM