రూ.25 లక్షలు సమర్పించుకున్నాడు..!
ABN , Publish Date - Mar 10 , 2026 | 09:16 AM
డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళ మాటలు నమ్మి రూ.25.01 లక్షలు సమర్పించుకున్నాడు. బడంగ్‌పేట్‌కు చెందిన వ్యక్తి (51) భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్నాడు.
డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళ మోసం
హైదరాబాద్ సిటీ: డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళ మాటలు నమ్మి రూ.25.01 లక్షలు సమర్పించుకున్నాడు. బడంగ్‌పేట్(Badangpet)కు చెందిన వ్యక్తి (51) భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. తోడు కోసం డేటింగ్ యాప్‌ల్లో రిజిస్టర్ చేసుకొని తగిన ప్రొఫైల్ కోసం వెదికాడు. ఈ తరుణంలో పరిచయమైన యువతి, అతడితో చాటింగ్ చేయడం ప్రారంభించింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా మంచి లాభాలు వస్తాయని చెప్పిన మహిళ అతడిని కూడా యాప్‌లో చేర్చింది. బాధితుడు ముందుగా కొద్ది మొత్తాలు పెట్టుబడి పెట్టాడు.
లాభాలు వచ్చినట్లు యాప్‌లో చూపించడంతో నిజమని నమ్మాడు. ఐపీఓలు కొంటే భారీ లాభాలు వస్తాయని స్నేహితురాలు చెప్పడంతో పలు దఫాలుగా రూ.24.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. యాప్‌లో లాభం వచ్చినట్లు చూపినా విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. ఆ విషయం అడిగితే ఇంకా పెట్టుబడులు పెట్టాలని డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్ప తగ్గుదల.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
వెంకటేశ్‌నాయుడు విచారణకు అనుమతివ్వండి
Read Latest Telangana News and National News