Share News

ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండ

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:50 PM

మన్యంలో సోమవారం ఉదయం పొగమంచు దట్టంగా కురిసింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంది.

ఉదయం పొగమంచు.. మధ్యాహ్నం ఎండ
డుంబ్రిగుడ మండలం కోర్రాలో పొగమంచు

మన్యంలో కొనసాగుతున్న భిన్న వాతావరణం

పాడేరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం ఉదయం పొగమంచు దట్టంగా కురిసింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఇలా భిన్న వాతావరణం కొద్ది రోజులుగా కొనసాగుతోంది. పాడేరులో సోమవారం తెల్లవారుజాము నుంచి పది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనాలు హెడ్‌ లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తుంచాల్సిన పరిస్థితి నెలకొంది. ముంచంగిపుట్టులో 17.7, చింతపల్లిలో 19.3, అరకులోయలో 19.5, పెదబయలులో 20.1, అనంతగిరి, జి.మాడుగులలో 21.2, కొయ్యూరులో 23.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

డుంబ్రిగుడలో..

డుంబ్రిగుడ: మండలంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం 9 గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. మధ్యాహ్నం ఎండ ఠారెత్తించింది. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.

Updated Date - Mar 09 , 2026 | 11:50 PM