గణేశ్ లడ్డూలు కొని, లాభాల ఆశ చూపి.. రూ.3.45 కోట్లు వసూళ్లు
ABN , Publish Date - Aug 07 , 2026 | 07:49 AM
వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలంలో భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకున్న వ్యక్తి అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత పెట్టుబడుల పేరిట పలువురిని మోసగించాడు.
మైహోమ్ భుజా నివాసితులకు ఓ వ్యక్తి టోకరా
హైదరాబాద్ సిటీ: వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలంలో భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకున్న వ్యక్తి అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత పెట్టుబడుల పేరిట పలువురిని మోసగించాడు. రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారాల్లో పెట్టుబడుల పేరిట రూ.3.45 కోట్లు సేకరించి పరారయ్యాడు. హైదరాబాద్, గచ్చిబౌలిలోని మైహోమ్ భుజా అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ ఘరానా మోసానికి సంబంధించి సిల్వియా శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కొండపల్లి గణేష్ అనే వ్యక్తిపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.
గతంలో మైహోమ్ భుజా అపార్ట్‌మెంట్‌లో నివాసమున్న కొండపల్లి గణేష్..2024, 2025 సంవత్సరాల్లో మైహోమ్ భుజా గణేశ్ లడ్డూ వేలాల్లో వరుసగా రూ.29 లక్షలు, రూ.51.07 లక్షలకు పైగా అత్యధిక ధర చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు. రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారాల్లో ఉన్న గణేష్.. ఈ లడ్డూల కొనుగోలుతో తానో విజయవంతమైన వ్యాపారిగా గుర్తింపు పొందారు. అపార్ట్‌మెంట్‌లో పలువురితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో తన వద్ద పెట్టుబడులు పెడితే నెలకు 6 శాతం రాబడి ఇస్తామని,
ప్రతీ మూడు నెలలకు లాభాలు చెల్లిస్తామని తన సహచరుడు బోయినపల్లి కిరణ్‌తో కలిసి కొండపల్లి గణేశ్ పలువురిని నమ్మించాడు. కొండపల్లి గణే్‌షపై నమ్మకంతో సిల్వియా శ్రీనివా్‌సరెడ్డి కుటుంబం రూ.11లక్షలు పెట్టుబడి పెట్టింది. అలాగే, బొత్స అప్పలనాయుడు, సి. శ్రీకృప, జి. నాగహరీష్, సముద్రాల రవిశంకర్, సముద్రాల సారిత తదితరులు కలిసి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇలా కొండపల్లి గణేష్ రూ.3.45 కోట్లకు పైగా
సేకరించారు. అనంతరం మైహోమ్ భుజాలోని తన అపార్ట్‌మెంట్, కార్యాలయాన్ని ఖాళీ చేసిన కొండపల్లి గణేష్.. గచ్చిబౌలిలోని మరో అపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయాడు. అప్పట్నించి ఎవరికీ అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News