Share News

పాము పగబట్టిందా ఏంటీ.. మళ్లీ అదే ఇంటికి కొండచిలువతో వచ్చింది.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 07 , 2026 | 07:04 AM

బిహార్‌ చంపారన్ జిల్లాలో బగాహ సమీపంలో వాల్మీకి నగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌కు ఎదురుగా ఉన్న నితీష్ కుమార్ ఇంటి ఆవరణలో రెండు పాములు ప్రత్యక్షమయ్యాయి.

పాము పగబట్టిందా ఏంటీ.. మళ్లీ అదే ఇంటికి కొండచిలువతో వచ్చింది.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌ చంపారన్ జిల్లాలో బగాహ సమీపంలో వాల్మీకి నగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్‌కు ఎదురుగా ఉన్న నితీష్ కుమార్ ఇంటి ఆవరణలో రెండు పాములు ప్రత్యక్షమయ్యాయి. ఒకటి కొండ చిలువ కాగా.. మరొకటి కింగ్ కోబ్రా. వీటిని చూసి ఆ ఇంట్లోని వారు భయంతో వణికిపోయారు. అదీకాక ఈ రెండు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉడడంతో ఘర్షణ పడతాయని భావించారు. వాటిని చూడగానే ఇంట్లోని వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలియగానే స్థానికులంతా అక్కడ గుమికూడారు.


సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, స్నేక్ క్యాచర్ మురారి అక్కడికి చేరుకున్నారు. స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా ఆ రెండు పాములను పట్టుకుని, అటవీ ప్రాంతంలో వదిలేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే నితీష్ కుమార్ ఇంటి ఆవరణలో సుమారు రెండేళ్ల క్రితం ఇలాగే కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. దానిని కూడా ఇలాగే చాలా జాగ్రత్తగా పట్టుకుని.. అటవీ ప్రాంతంలో వదిలేశారు. తాజాగా అదే ఇంట్లో కింగ్ కోబ్రాతో పాటు కొండ చిలువ కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కింగ్ కోబ్రా ఏమైనా పగబట్టిందా అంటూ అంతా చర్చించుకుంటున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టాలు దాటుతున్న ఆవు.. సడన్‌గా దూసుకొచ్చిన రైలు.. కట్‌చేస్తే..

బైక్ హెడ్‌లైట్‌లో చప్పుడు.. ఏముందా అని చూడగా.. చివరకు షాకింగ్ సీన్

For More Viral News And Telugu News

Updated Date - Aug 07 , 2026 | 07:44 AM