పట్టాలు దాటుతున్న ఆవు.. సడన్‌గా దూసుకొచ్చిన రైలు.. కట్‌చేస్తే..
ABN , Publish Date - Aug 06 , 2026 | 08:05 AM
ఉత్తరప్రదేశ్‌లోని పాలియా అటారియా రైల్వే క్రాసింగ్ వద్ద ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు పట్టాలు దాటుతుండగా.. సడన్‌గా రైలు దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని పాలియా అటారియా రైల్వే క్రాసింగ్ వద్ద ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు పట్టాలు దాటుతుండగా.. సడన్‌గా రైలు దూసుకొచ్చింది. రైల్వే క్రాసింగ్ గుండా ఒక్కసరిగా పట్టాలపైకి రావడంతో అక్కడ వేచి ఉన్న స్థానికులు, ప్రయాణికులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. ఆవును వెనుక వైపు చివరలో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆవు చనిపోయి ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే అశ్చర్యకరంగా ఆ ఆవుకు ఏమీ కాలేదు. పల్టీలు కొట్టిన ఆవు.. చివరకు తేరుకుని పైకి లేచి తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ వీడియో arvind714yadav అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘శివుని అనుగ్రహం వల్లే ఆవు అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది’ అని కామెంట్ చేశారు. ‘రైలు ట్రాక్ సమీపంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి.. మొత్తానికి ఈ ఆవు టైమ్ బాగుంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఇది దైవ లీల.. హర్ హర్ మహాదేవ్’ అని ఇంకొకరు కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News And Telugu News