చనిపోయిన పిల్ల డాల్ఫిన్‌ను మోసుకెళ్తున్న తల్లి డాల్ఫిన్.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Aug 05 , 2026 | 09:39 PM
కన్నబిడ్డలు దూరమైతే ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. అలాంటి బాధ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నిరూపిస్తోంది.
కన్నబిడ్డలు దూరమైతే ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. అలాంటి బాధ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నిరూపిస్తోంది. పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలో హృదయాలను కదిలించే ఓ ఘటన వెలుగుచూసింది. ఓ తల్లి డాల్ఫిన్ చనిపోయిన తన రెండు వారాల పిల్ల డాల్ఫిన్‌ను నీటి ఉపరితలంపై మోసుకుంటూ కనిపించింది ( Dolphin Grief Viral Video).
ఈ దృశ్యాలను పరిశోధకులు డ్రోన్‌తో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ తల్లి డాల్ఫిన్ పేరు ఫ్రాగుల్ అని వారు తెలిపారు. పిల్ల డాల్ఫిన్ మరణానికి ముందు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడినట్లు పరిశోధకులు గుర్తించారు. పిల్ల చనిపోయిన తర్వాత కూడా తల్లి డాల్ఫిన్ దానిని మళ్లీ మళ్లీ నీటి పైకి తోస్తూ, మునిగిపోకుండా కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో అదే గుంపులోని ఇతర డాల్ఫిన్లు కూడా తోడుగా ప్రయాణించడం విశేషం (Dolphin Mourning).
జంతువులు కూడా మనుషుల మాదిరిగానే దుఃఖాన్ని అనుభవిస్తాయా అనే చర్చను ఈ ఘటన లేవనెత్తింది (Wildlife Viral Video). డాల్ఫిన్లు, తిమింగలాలు వంటి సముద్ర క్షీరదాల్లో ఇలాంటి స్వభావాన్ని గతంలో కూడా గుర్తించినట్టు జంతు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని భావోద్వేగానికి గురి చేసింది. 'జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి', 'తల్లి ప్రేమకు హద్దులు లేవు' అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సిందే.. యూపీఐ చార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..
షేక్ హసీనా ప్రసంగంతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు: విదేశాంగ శాఖ