దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర: వెంకయ్యనాయుడు
ABN , Publish Date - Aug 05 , 2026 | 08:42 PM
విద్య అనేది కేవలం ఉద్యోగం పొందడానికి మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి, దేశ నిర్మాణానికి దోహదపడాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: విద్య అనేది కేవలం ఉద్యోగం పొందడానికి మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి, దేశ నిర్మాణానికి దోహదపడాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి లోకేష్‌తో పాటు వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు. పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు (M Venkaiah Naidu).
'విదేశాల్లో చదువుకున్నా మనదేశానికి వచ్చి సేవ చేయండి. చదువు సంస్కారం నేర్పాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు మీ పనులు పూర్తి చేసుకొండి. తల్లిదండ్రులతో కలిసి సమయం గడపండి. కుటుంబ వ్యవస్థకు మూలం భారత్. ప్రపంచంలో భారత్ శక్తి వంతమైన దేశం. భారత్ విశ్వ గురువు. గతంలో ప్రపంచంలోని పలు దేశాల విద్యార్థులు మన దేశంలోని నలందా, తక్షశిల లాంటి యూనివర్సిటీల్లో చదువుకున్నారు' అని వెంకయ్య పేర్కొన్నారు (Amrita University Amaravati).
'నేను స్కూల్ నుంచే విద్యార్థి నాయకుడిగా పని చేశా. ఎమర్జెన్సీ టైమ్‌లో 17 నెలలు పాటు జైళ్లో ఉన్నా. 1983లో ఎమ్మెల్యేగా గెలిచా. రాజకీయాల్లో ఉండగా నా జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో 30 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నా. నేను ఒకప్పుడు వాజపేయి పేరు గోడ మీద రాశాను. అదే వాజపేయితో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఒకే వేదికపై కూర్చున్నా' అని వెంకయ్య గుర్తు చేసుకున్నారు (AP Higher Education).
అంతకు ముందు మంత్రి నారాలోకేష్ కూడా మాట్లాడారు. భవిష్యత్ అవకాశాలను అందుపుచ్చుకునేలా విద్యారంగంలో సమూల మార్పులు రావాలని లోకేష్ ఆకాంక్షించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతమైన ఎకోసిస్టమ్ నిర్మాణం జరుగుతోందన్నారు. వైఫల్యాలను చూసి భయపడొద్దని, ఆత్మవిశ్వాసంతో యువత ముందుకు సాగాలని సూచించారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలంటే కఠినమైన మార్గాన్ని మాత్రమే ఎంచుకోవాలని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సిందే.. యూపీఐ చార్జీలపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..
షేక్ హసీనా ప్రసంగంతో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు: విదేశాంగ శాఖ