క్లాస్‌రూములో గురకపెట్టి నిద్రపోయిన టీచర్.. వైరల్‌గా మారిన వీడియో..
ABN , Publish Date - Aug 04 , 2026 | 01:49 PM
విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు క్లాస్‌రూములో గురకపెట్టి నిద్రపోయాడు. ఓ వైపు ఉపాధ్యాయుడు నిద్రపోతుంటే.. మరో వైపు విద్యార్థులు ఫోన్‌లో వీడియోలు చూస్తూ రచ్చరచ్చ చేశారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు క్లాస్‌రూములో గురకపెట్టి నిద్రపోయాడు. ఓ వైపు ఉపాధ్యాయుడు నిద్రపోతుంటే.. మరో వైపు విద్యార్థులు ఫోన్‌లో వీడియోలు చూస్తూ రచ్చరచ్చ చేశారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనకు సంబంధించిన వీడియోను ప్రియా సింగ్ అనే మహిళ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే.. క్లాస్ రూములో ఉపాధ్యాయుడు బెంచ్‌పై నిద్రపోతున్నాడు.
ఆయనకు కొద్దిదూరంలో విద్యార్థులు సెల్‌ఫోన్‌లో వీడియోలు చూస్తున్నారు. 21 సెకన్ల ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా ఈ సంఘటన ఉమర్దా బ్లాక్‌లో ఉన్న సికందరి గ్రామంలోని కంపోజిట్ విద్యాలయలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
లుసానె డైమండ్ లీగ్: బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా
మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు