Share News

ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన

ABN , Publish Date - Aug 07 , 2026 | 07:18 AM

ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండనుండగా, మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది.

ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన
Andhra Pradesh Weather

అమరావతి, ఆగస్టు 7: ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయని అధికారులు పేర్కొన్నారు.


వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉండగా, వాతావరణం చల్లబడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు, రైతులు తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని, పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీశైలానికి పోటెత్తిన వరద

గౌరవప్రద జీవనం కోసమే..

For More AP News And Telugu News

Updated Date - Aug 07 , 2026 | 07:21 AM