Share News

హృదయవిదారక ఘటన.. బిడ్డ కళేబరంతో 6 రోజులుగా..

ABN , Publish Date - Aug 05 , 2026 | 07:57 AM

ఓ తల్లి డాల్ఫిన్ చనిపోయిన తన బిడ్డ కళేబరాన్ని మోసుకుతిరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఆరు రోజులుగా ఆ పని చేస్తోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.

హృదయవిదారక ఘటన.. బిడ్డ కళేబరంతో 6 రోజులుగా..
mother dolphin

ఇంటర్‌నెట్ డెస్క్: ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. తల్లి ప్రేమకు మనుషులు, మూగ జీవాలన్న తేడా లేదు. మూగ జీవాలు కూడా తమ బిడ్డల కోసం పరితపిస్తాయి. బిడ్డలకు ఏమైనా అయితే తట్టుకోలేవు. ఇందుకు తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఓ తల్లి డాల్ఫిన్ చనిపోయిన తన బిడ్డ కళేబరాన్ని మోసుకుతిరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఆరు రోజులుగా ఆ పని చేస్తోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఆస్ట్రేలియాలోని హిందూ మహా సముద్రంలో ఫ్రాగిల్ అనే బాటిల్ నెక్ డాల్ఫిన్ నివసిస్తోంది. మూడు వారాల క్రితం ఫ్రాగిల్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ బిడ్డ ఆరు రోజుల క్రితం చనిపోయింది. బిడ్డ మృతిని ఆ డాల్ఫిన్ తట్టుకోలేకపోయింది. బిడ్డ కళేబరాన్ని మీద ఉంచుకుని సముద్రంలో తిరుగుతోంది. ఆస్ట్రేలియన్ కన్సర్వేషన్ ఆర్గనైజేషన్ అయిన జియోగ్రాఫ్ మెరైన్ రీసెర్చ్ బృందం డ్రోన్ సాయంతో ఈ దృశ్యాలను చిత్రీకరించింది. జియోగ్రాఫ్ మెరైన్ రీసెర్చ్ బృందం ఫ్రాగిల్ గురించి మాట్లాడుతూ విషాదకరమైన దాని స్టోరీని మీడియాతో పంచుకున్నారు.


‘ఫ్రాగిల్ బిడ్డను కోల్పోవటం ఇది మొదటిసారి కాదు. గతంలో నాలుగు సార్లు పిల్లలు పుట్టి చనిపోయాయి. ఈ సారి ఫ్రాగిల్ తట్టుకోలేకపోయింది. డాల్ఫిన్లు కొన్ని రోజుల పాటు చనిపోయిన బిడ్డను మోసుకు తిరుగుతాయి. తర్వాత ఆ నీటిలోనే వదిలేస్తాయి’ అని తెలిపారు. ఫ్రాగిల్.. బిడ్డ కళేబరాన్ని మోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదు. ఆఖరికి జంతువులైనా సరే’..‘ఈ వీడియో చూస్తుంటే చాలా బాధగా ఉంది. బిడ్డ చనిపోతే నరకం అనుభవించాల్సి వస్తుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వన్డే ప్రపంచ కప్.. రోహిత్ శర్మ జట్టు నుంచి స్వచ్ఛందంగా తప్పుకోడు: మహ్మద్ కైఫ్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్

Updated Date - Aug 05 , 2026 | 08:28 AM