Share News

శుభకార్యాలు, ఫంక్షన్లకు కుళ్లిన మాంసం సరఫరా

ABN , Publish Date - Mar 12 , 2026 | 09:30 AM

నగరంలో హోటళ్లు, ఫంక్షన్లకు కుళ్లిన మాంసం సరఫరా చేస్తున్న వ్యక్తిని గోల్కొండ టాస్క్‌ఫోర్స్‌, మంగళ్‌హాట్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి అరెస్ట్‌ చేశారు.

శుభకార్యాలు, ఫంక్షన్లకు కుళ్లిన మాంసం సరఫరా

  • 300 కిలోలు స్వాధీనం

  • విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్: నగరంలో హోటళ్లు, ఫంక్షన్లకు కుళ్లిన మాంసం సరఫరా చేస్తున్న వ్యక్తిని గోల్కొండ టాస్క్‌ఫోర్స్‌, మంగళ్‌హాట్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి అరెస్ట్‌ చేశారు. మంగళ్‌హాట్‌ పోలీస్‏స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్‌ డీసీపీ కృష్ణాగౌడ్‌ వివరాలను వెల్లడించారు. మంగళ్‌హాట్‌కు చెందిన మహమ్మద్‌ అఫ్రోజ్‌ (41) చిస్తీ చమన్‌ దర్గాలో ‘ఏ టు జడ్‌ షీప్‌ అండ్‌ గోట్‌ ఓఫల్స్‌’ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడు మేకలు, గొర్రెలకు సంబంధించిన తల, కాళ్లు, పొట్ట తదితర విడిభాగాలను నిల్వ ఉంచి విక్రయిస్తున్నాడు.


city5.2.jpgతక్కువ ధరకే కర్ణాటక, ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల నుంచి కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసాన్ని కొనుగోలు చేస్తున్నాడు. వీటిని డీప్‌ ఫ్రీజర్‌లో భద్రపరిచి, హోటళ్లకు, ఫంక్షన్‌లకు సరఫరా చేస్తున్నాడు. ఇతడి దందాపై సమాచారమందుకున్న అధికారులు దుకాణంపై దాడి చేశారు. డీప్‌ ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన 300 కిలోల కుళ్లిపోయిన మాంసాన్ని సీజ్‌చేసి, నిందితుడు అఫ్రోజ్‌ను అరెస్ట్‌ చేశారు. నిల్వ ఉంచిన ఈ మాంసం, ఇతర పదార్థాలను శుభకార్యాలు, ఫంక్షన్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో గోషామహల్‌ ఏసీపీ సుదర్శన్‌, మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

అతనికి అందిస్తున్నచికిత్సను నిలిపివేయొచ్చు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2026 | 10:34 AM