గురివింద కేటీఆర్..నీ నలుపు చూసుకో: ఆది శ్రీనివాస్
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:39 AM
అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పుపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న గురివింద కేటీఆర్.. పదేళ్ల పాలనలో నీ కింద ఉన్న నలుపును ఒకసారి చూసుకో...
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ‘అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పుపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న గురివింద కేటీఆర్.. పదేళ్ల పాలనలో నీ కింద ఉన్న నలుపును ఒకసారి చూసుకో’ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హితవు పలికారు. ప్రజాస్వామిక విలువలు అన్న పదాన్ని ఉచ్చరించే అర్హతే కేసీఆర్ కుటుంబానికి లేదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలను రాజ్‌భవన్ సాక్షిగా ఖూనీ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇచ్చింది కేసీఆర్ కాదా అని ఆది శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో నిలదీశారు. కాగా రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు మొదలు పెట్టిందే కేసీఆర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘కడియం ఆడా.. మగా అంటున్న కేటీఆర్.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుని మంత్రులనూ చేసిన ఆయన ఏమవుతాడు?’’ అని ప్రశ్నిచారు.