Share News

ఏరోస్పేస్‌ రంగంలో ఏపీకి అవార్డు

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:31 AM

విమానయాన విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో చేసిన కృషికి ఆంధ్రప్రదేశ్‌ అవార్డు అందుకుంది.

ఏరోస్పేస్‌ రంగంలో ఏపీకి అవార్డు

న్యూఢిల్లీ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): విమానయాన విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో చేసిన కృషికి ఆంధ్రప్రదేశ్‌ అవార్డు అందుకుంది. బుధవారం ఢిల్లీలో బిజినెస్‌ టుడే, ఏరోస్పేస్‌ మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ఎంఆర్‌ఓ సౌత్‌ ఏషియా సమ్మిట్‌లో ప్రదానం చేసిన ఎక్సలెన్స్‌ ఇన్‌ గ్లోబల్‌ ఎంఆర్‌ఓ 2026 అవార్డులలో ఏపీకి ‘మోస్ట్‌ ప్రామిసింగ్‌ ఎంఆర్‌ఓ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కింది. ఈ అవార్డు ప్రధానోత్సవానికి గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ భవన్‌ అధికారులు కదిరిమోహన ప్రభాకర్‌, సాయిమానస అవార్డును అందుకున్నారు. విమానాల నిర్వహణ, మరమ్మత్తులు, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ)తో పాటు ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన సంస్థలు, ప్రభుత్వాలను ఈ అవార్డులకు ఎంపిక చేస్తుంటారు.

Updated Date - Mar 12 , 2026 | 04:31 AM