భార్యాపిల్లలకు బాయ్ చెప్పి.. రోడ్డెక్కగానే..
ABN , Publish Date - Oct 09 , 2026 | 08:24 AM
పది నిమిషాల ముందు భార్యాపిల్లలకు బాయ్ అని చెప్పి ఇంటి నుంచి స్కూటీపై బయలుదేరిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ట్రాలీ ఆటోలోని ఇనుప పైపులు మీద పడడంతో వ్యక్తి దుర్మరణం
హైదరాబాద్: పది నిమిషాల ముందు భార్యాపిల్లలకు బాయ్ అని చెప్పి ఇంటి నుంచి స్కూటీపై బయలుదేరిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ట్రాలీ ఆటోలోని ఇనుప పైపులు అతనిపై జారి పడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బాలానగర్ ఇన్‌స్పెక్టర్ జి.ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం నయీం పాషా అనే డ్రైవరు తన ట్రాలీ ఆటోలో బాలానగర్‌లోని ఓ ఐరన్ స్టీల్ షాపులో ఇనుప పైపులను కొనుగోలు చేసి వాటిని రాణిగంజ్‌కు తరలించేందుకు బయలుదేరాడు.
బాలానగర్ ఫ్లైఓవర్ సమీపంలో ఫతేనగర్‌కు వెళ్లే యూటర్న్ వద్దకు రాగానే ఆటోలోని పైపులు ఒక్కసారిగా ఎడమ వైపునకు ఒరిగాయి. అదే సమయంలో షాపూర్ సంజయ్ గాంధీనగర్‌కు చెందిన ప్రకాష్ పవార్ (55) అమీర్‌పేటలోని దుకాణానికి స్కూటీపై వెళ్తూ ఆటో పక్కకు చేరుకున్నాడు. ప్రకాష్ పవార్ మీద పైపులు పడిపోయాయి. అతని తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిర్లక్షంగా ట్రాలీ ఆటో నడిపిన డ్రైవర్ నయూంపాషాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పండుగ సీజన్.. గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News