Share News

రిటైర్డ్‌ ఉద్యోగికి రూ.20లక్షల మోసం

ABN , Publish Date - Oct 09 , 2026 | 08:03 AM

ఈసీఐఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి(66)ని సైబర్‌ కేటుగాళ్లు బెదిరింపులకు గురిచేసి సుమారు రూ.20లక్షలను కాజేశారు.

రిటైర్డ్‌ ఉద్యోగికి రూ.20లక్షల మోసం
Cyber Crime

  • మరింతగా మోసపోకుండా అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్: ఈసీఐఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి(66)ని సైబర్‌ కేటుగాళ్లు బెదిరింపులకు గురిచేసి సుమారు రూ.20లక్షలను కాజేశారు. మరిన్ని లక్షలు కాజేసేందుకు స్కెచ్‌ వేయగా పోలీసులు అప్రమత్తమై అడ్డుకునడంతో భారీ మోసం తప్పినట్లయింది. రిటైర్డ్‌ ఉద్యోగికి ఈ నెల 5న ఫేస్‌బుక్‌ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి న్యూడ్‌ వీడియో కాల్‌ చేశాడు. దీనికి బాధితుడు స్పందించాడు. అయితే, ఈ న్యూడ్‌ వీడియో కాల్‌ను రికార్డు చేసిన కేటుగాళ్లు దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తామని బెదిరించారు.


city2.2.jpgఇప్పటికే యూట్యూబ్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో కూడా వీడియోను పోస్ట్‌ చేశామని, వాటి నుంచి తొలగించాలంటే రూ.30లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో భయభ్రాంతులకు గురైన బాధితుడు వారికి పలు దఫాలుగా రూ.18లక్షల వరకు చెల్లించారు. గురువారం మరో రూ.2లక్షలు బదిలీ చేశాడు. అయితే, బ్యాంకు అధికారులు ఆరా తీసి సైబర్‌క్రైం ఇన్‌స్పెక్టర్‌ సందీప్ కు జరిగిన సంఘటనను వివరించారు.


హుటాహుటిన బ్యాంకు చేరుకున్న పోలీసులు బాధితుడి బ్యాంకు ఖాతాలో ఇంకా రూ.80లక్షల నగదు, ఎఫ్‌డీలు, ఇతర డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అవి మోసగాళ్ల ఖాతాకు బదిలీగాకుండా ఆపగలిగారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పండుగ సీజన్.. గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 08:03 AM