జూబ్లీహిల్స్‌లోని స్టోర్‌లో నీతా అంబానీ
ABN , Publish Date - Oct 09 , 2026 | 06:49 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అల్కాజార్ మాల్‌లో సందడి చేశారు.
బంజారాహిల్స్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అల్కాజార్ మాల్‌లో సందడి చేశారు. రిలయన్స్ సంస్థలకు చెందిన గాప్, సెంట్రో, వీఆర్‌కే హెరిటేజ్, స్వదేశీ స్టోర్‌లను సందర్శించారు. మాల్‌లోని రెండో అంతస్తులో కొనసాగుతున్న లగ్జరీ హ్యాండ్‌క్రాఫ్ట్ స్టోర్ ‘స్వదేశ్’ విస్తరణ పనులను ఆమె పరిశీలించారు. ఒక్కో స్టోర్‌లో పది నిమిషాలు గడిపిన ఆమె తిరిగి వెళ్లిపోయారు.