Share News

మానసిక ఒత్తిడితోనే కుటుంబం ఆత్మహత్య

ABN , Publish Date - Nov 12 , 2026 | 08:33 AM

దీపావళి పండుగ రోజే భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న బత్తుల మర్రెడ్డి కేసులో మిస్టరీ వీడినట్లు తెలిసింది.

మానసిక ఒత్తిడితోనే కుటుంబం ఆత్మహత్య
Gachibowli Family Suicide

  • మర్రెడ్డి కుటుంబం కేసులో నిర్ధారణ!

  • కోడలు పండుగకు వెళ్లిన మూడు రోజులకే బలవన్మరణానికి పాల్పడిన కుటుంబం

హైదరాబాద్‌ సిటీ: దీపావళి పండుగ రోజే భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న బత్తుల మర్రెడ్డి కేసులో మిస్టరీ వీడినట్లు తెలిసింది. తీవ్ర మానసిక ఒత్తిడితో పాటు.. అనారోగ్య సమస్యలే వారి ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చినట్లు సమాచారం. గచ్చిబౌలి, గౌలిదొడ్డిలోని జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్స్‌, సి-బ్లాక్‌, ఫ్లాట్‌ నెం. 702లో బత్తుల మర్రెడ్డి (65), ఆయన భార్య బత్తుల భారతి (60), వారి కుమారుడు బత్తుల నిశాంత్‌ రెడ్డి (38) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకోగా.. మరుసటి రోజు దీపావళి పండుగనాడు వెలుగులోకి వచ్చింది. వారంతా ఏడాది నుంచి అదే ఫ్లాట్‌లో కోడలు, మనువడితో కలిసి నివసిస్తున్నారు.


city3.jpgకోడలు పండక్కి వెళ్లగానే..

బత్తుల మర్రెడ్డి కొడుకు నిశాంత్‌రెడ్డి కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణతో తేలింది. దాంతో ప్రతీ చిన్న విషయానికీ ఆయన భార్య తేజస్వినీరెడ్డి, కొడుకు అరుణ్‌తేజ్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడని తెలిసింది. మానసిక ఒత్తిడితో ఉండే తన భర్త ఎక్కడ తన కొడుకుపై దాడి చేస్తాడోనని తేజస్వినిరెడ్డి అనుక్షణం భయపడుతుండేదని సమాచారం. కొడుకును తండ్రి వద్ద ఒంటరిగా వదిలేయొద్దని, కనిపెట్టుకొని ఉండాలని తేజస్వినికి బంధువులు సైతం సూచించినట్లు తెలుస్తోంది. దాంతో తన భర్త విషయంలో తేజస్విని ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండేది.


ఒక్కోసారి అనుకోకుండానే నిశాంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఆ సమయంలో ఏం చేస్తాడో? ఎలా ప్రవర్తిస్తాడో అని కుటుంబ సభ్యులు భయపడేవారని విచారణలో తేలినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తేజస్విని దీపావళి పండుగకు తన కొడుకును తీసుకొని తన అన్నయ్య ఇంటికి వెళ్లింది. అనంతరం బత్తుల మర్రెడ్డి, ఆయన భార్య, కొడుకు కలిసి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. బతుకు భారంగా మారడం, తీవ్ర మానసిక ఒత్తిడితో రోజూ నరకయాతన అనుభవిస్తుండటంతో అంతా కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నామని, తమ ప్రభావం కోడలు, మనవడిపై పడొద్దనే ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు మర్రెడ్డి సూసైడ్‌ నోట్‌లో స్పష్టంగా రాసినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మూలకుపడిన స్మార్ట్‌కార్డులు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు.. క్యూలైన్‌ శిలాతోరణం వరకు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 08:33 AM