చరిత్ర సృష్టించిన అఫ్గాన్ ప్లేయర్.. తొలి బ్యాటర్‌గా రికార్డు
ABN , Publish Date - Nov 12 , 2026 | 08:18 AM
అఫ్గానిస్థాన్ కెప్టెన్ రహ్మత్ షా ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ పురుషుల టెస్టు ర్యాంకింగ్స్‌లో మొట్టమొదటి సారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్ కెప్టెన్ రహ్మత్ షా ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ పురుషుల టెస్టు ర్యాంకింగ్స్‌లో మొట్టమొదటి సారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. దీంతో అఫ్గానిస్థాన్ తరఫున ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రహ్మత్ షా రికార్డులకెక్కాడు. బుధవారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
షార్జా వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో రహ్మత్ షా (173 పరుగులు) భారీ సెంచరీతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి దూసుకెళ్లాడు. 735 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఇక్కడ భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మార్‌క్రమ్, కమిందు మెండిస్‌లను రహ్మత్ షా అధిగమించడం విశేషం. ఇదే మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన మరో అఫ్గాన్ బ్యాటర్ సెదికుల్లా అటల్ కూడా ర్యాంకింగ్స్‌లో పురోగతిని సాధించాడు. ఏకంగా 14 స్థానాలు ఎగబాకిన సెదికుల్లా అటల్ (414 పాయింట్స్) 81వ స్థానంలో నిలిచాడు. ఇక అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన రహ‌్మనుల్లా 83వ స్థానంలో నిలిచాడు.
జింబాబ్వే బ్యాటర్లు కూడా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. 41 ఏళ్ల వయసులో ద్విశతకం సాధించిన క్రెయిగ్ ఎర్విన్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 48వ స్థానంలో నిలవగా, సెంచరీ సాధించిన జింబాబ్వే కెప్టెన్ బ్రియాన్ బెన్నెట్ 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకున్నాడు. ఇక మరో సీనియర్ బ్రెండన్ టేలర్ 103వ స్థానంలో నిలిచాడు. ఇరుజట్లు కలిపి వెయ్యికి పైగా పరుగులు నమోదు చేసిన ఈ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇవీ చదవండి
పిల్లల్లోనూ గుండెపోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు!
పసుపు పాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు