Share News

మచ్చే పట్టించింది..

ABN , Publish Date - Sep 09 , 2026 | 09:06 AM

ముఖానికి మాస్క్‌తో ఎలాంటి క్లూ చిక్కకుండా వ్యాపారి ఇంట్లో బంగారు, వజ్రాభరణాలు చోరీ చేసిన ఓ దొంగకు సంబంధించిన కేసును జూబ్లీహిల్స్‌ పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు.

మచ్చే పట్టించింది..
crime news, Hyderabad

  • గోవాలో దొరికిన దొంగ

  • జూబ్లీహిల్స్‌ వ్యాపారి ఇంట్లో చోరీ కేసు ఛేదన

హైదరాబాద్: ముఖానికి మాస్క్‌తో ఎలాంటి క్లూ చిక్కకుండా వ్యాపారి ఇంట్లో బంగారు, వజ్రాభరణాలు చోరీ చేసిన ఓ దొంగకు సంబంధించిన కేసును జూబ్లీహిల్స్‌ పోలీసులు మూడు రోజుల్లో ఛేదించారు. కేవలం నుదుటి మీద ఉన్న మచ్చే అతన్ని పట్టించింది. గోవాలో జల్సాలు చేస్తూ ఉన్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని ఓ వీధిలో చోరీకి ఓ దొంగ విఫలయత్నం చేశాడు.


ముందుగా ఓ నగల దుకాణంలోకి, ఆ తర్వాత ఓ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించినా సాధ్య పడలేదు. అనంతరం బగ్గా వైన్స్‌ యజమాని శైలేందర్‌సింగ్‌ ఇంట్లోకి కిటికీ ద్వారా వెళ్లి అల్మారాలో ఉన్న ఎమరాల్డ్‌ డైమండ్‌ రింగ్‌, రెండు బంగారు బ్రాస్‌లెట్లు, బ్లూ మీనాకారీ నెక్లెస్‌, కడా, చోకర్‌ సహా దాదాపు 10 తులాల విలువైన ఆభరణాలను దొంగలించి పారిపోయాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


సీసీ కెమెరాను పరిశీలించగా నిందితుడి కదలికలు రికార్డు అయ్యాయి. కానీ అతని ముఖానికి మాస్క్‌ ఉండటంతో గుర్తు పట్టలేకపోయారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను పరిశీలించినా ఫలితం లేకపోయింది. అయితే.. నిందితుడి కనుబొమ్మపై గాయం తాలూకు మచ్చ ఒకటి సీసీ ఫుటేజీలో కనిపించింది.


దానినే క్లూగా తీసుకున్న పోలీసులు వెంటనే ఆ పోలికలతో ఉన్న పాత నేరస్థుల జాబితాను పరిశీలించారు. చోరీ చేసింది కృష్ణానగర్‌లో నివాసముంటూ జూనియర్‌ ఆర్టి్‌స్టగా పనిచేస్తున్న గౌరేష్‌ అని తేలింది. సాంకేతిక ఆధారాలతో అతడిని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. గౌరే్‌షపై మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లలోనూ చోరీ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరల్లో ఊగిసలాట.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

‘ఇందిరమ్మ’ లాటరీలో ఇళ్లురాని వారికి ధరావతు వాపస్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 09:06 AM