Share News

తెలంగాణకు వర్ష సూచన.. నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ABN , Publish Date - Sep 09 , 2026 | 07:29 AM

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

తెలంగాణకు వర్ష సూచన.. నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

హైదరాబాద్, సెప్టెంబరు 9: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. జోగులాంబ గద్వాల్, నిర్మల్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరల్లో ఊగిసలాట.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

Read Latest AP News And Telangana News 

Updated Date - Sep 09 , 2026 | 07:42 AM