Share News

బేగంబజార్‌లో నకిలీ బ్రాండ్‌ కొబ్బరి పొడి కేంద్రం

ABN , Publish Date - Mar 26 , 2026 | 08:25 AM

బేగంబజార్‌లో నకిలీ బ్రాండ్‌తో కొబ్బరి పొడిని ప్యాక్‌ చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్‌ సిటీ టాస్క్‌ఫోర్స్‌, గోషామహల్‌ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు.

బేగంబజార్‌లో నకిలీ బ్రాండ్‌ కొబ్బరి పొడి కేంద్రం

  • పోలీసుల దాడి

  • 8,300 కిలోలు స్వాధీనం

హైదరాబాద్: బేగంబజార్‌లో నకిలీ బ్రాండ్‌తో కొబ్బరి పొడిని ప్యాక్‌ చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్‌ సిటీ టాస్క్‌ఫోర్స్‌, గోషామహల్‌ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. రూ.21 లక్షల విలువైన 8,300 కిలోల కొబ్బరి పొడి సంచులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం..


city4.2.jpgనకుల్‌ మరోటియా(31) కర్ణాటక(Karnataka) నుంచి తక్కువ నాణ్యత గల కొబ్బరి పొడిని కొనుగోలు చేసి చేతక్‌ బ్రాండ్‌ పేరుతో నకిలీది ప్యాక్‌ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నాడు. హోల్‌సేల్‌ షాపులకు కూడా సరఫరా చేస్తున్నాడు. అతడిని అదుపులోకి తీసుకుని ప్యాకింగ్‌ మెషీన్లు, కవర్లు, తూకం యంత్రాలు, స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎం రేవంత్‌ కేరళ పర్యటన రద్దు

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2026 | 08:25 AM