ఇరాన్ అత్యున్నత పదవి చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 07:52 AM
ఇరాన్ అత్యున్నత పదవి చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా చేతిలో హతమవుతామనే భయమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. ఇరాన్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని ఒక విచిత్రమైన భయం నెలకొందన్నారు.
ఆంధ్రజ్యోతి, మార్చి 26: ఇరాన్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక విచిత్రమైన భయం నెలకొందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ అత్యున్నత పదవి చేపట్టేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదని, అమెరికా చేతిలో హతమవుతామనే భయమే దీనికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ లేదా కీలక పదవుల్లో ఉన్న వారు వరుసగా లక్ష్యంగా మారుతుండటంతో, ఆ స్థానాలను భర్తీ చేయడం ఇరాన్‌కు కష్టతరంగా మారిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ తన పంథాను మార్చుకోకపోతే, ఆ దేశ నాయకత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు.
'ఎవరైతే ఆ పదవిని చేపడతారో, వారు తర్వాతి లక్ష్యం అవుతారని వారికి తెలుసు' అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం, వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీ (NRCC) వార్షిక నిధుల సేకరణ విందు కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సీఎం రేవంత్ కేరళ పర్యటన రద్దు
ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Read Latest Telangana News and National News