Share News

రైల్వే స్టేషన్‌లో నకిలీ పాముతో యువకుడి హల్‌చల్.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 26 , 2026 | 07:51 AM

సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం కొంతమంది యువకులు ఎంతకైనా తెగిస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. చిత్ర విచిత్రమైన రీల్స్ చేస్తూ వికృత చేష్టలు చేస్తున్నారు. ఓ యువకుడు పాము ప్రాంక్‌తో చేసిన హంగామాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే స్టేషన్‌లో నకిలీ పాముతో యువకుడి హల్‌చల్.. వీడియో వైరల్
Fake Snake Prank

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం కొంతమంది యువకులు ఎంతకైనా తెగిస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. చిత్ర విచిత్రమైన రీల్స్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పపడుతున్నారు. వారు చేసే పనుల వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వ్యక్తి రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో నకిలీ 'పాము ప్రాంక్'తో హల్‌చల్ సృష్టించాడు. నిజమైన పాము అనుకొని చాలా మంది భయ‌పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినోదం పేరుతో సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక యువకుడు రద్దీగా రైల్వే స్టేషన్‌లో ఒక నకిలీ పాముతో ప్రాంక్ చేశాడు. అది నిజమైన పాము అని భ్రమపడిన జనం భయంతో కేకలు వేస్తూ, అరుస్తూ పరుగెత్తడం ప్రారంభించారు. చాలా మంది మహిళలు, పిల్లలు భయంతో వణికిపోయారు. కొందరు ప్రయాణికులు తమ బ్యాగ్స్ పడేసి పారిపోగా, మరికొందరు ఆ యువకుడిని చుట్టుముట్టారు. ఆ దృశ్యాలను సదరు యువకుడు తన కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువకుడిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.


ఈ వీడియో @Nalanda_index అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఇది మరీ దారుణం.. బహిరంగ ప్రదేశాల్లో గందరగోళం సృష్టించినందుకు అతనిపై కేసు నమోదు చేయాలి’ అని కామెంట్ చేయగా, ‘కనీసం ఒక్కరైనా అతన్ని ఎందుకు కొట్టలేదో ఆశ్చర్యంగా ఉంది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఇది కంటెంట్ కాదు, ఇది నేరపూరిత నిర్లక్ష్యం. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి

బయటపడిన కోటక్ బ్యాంక్ మోసం.. మీ బ్యాంక్ డిపాజిట్లు ఎంత సురక్షితం..

వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Mar 26 , 2026 | 08:10 AM