Share News

బయటపడిన కోటక్ బ్యాంక్ మోసం.. మీ బ్యాంక్ డిపాజిట్లు ఎంత సురక్షితం..

ABN , Publish Date - Mar 25 , 2026 | 06:10 PM

సాధారణ ప్రజలు ఎంతో మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లను సురక్షితంగా భావిస్తారు. ఎఫ్‌డీలలో పెట్టుబడులు పెడతారు. నిబంధనల ప్రకారం.. మనం ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాచుకునే డబ్బు ఎంత వరకు సురక్షితం?

బయటపడిన కోటక్ బ్యాంక్ మోసం.. మీ బ్యాంక్ డిపాజిట్లు ఎంత సురక్షితం..
Bank deposits safety India

హర్యానాలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ పంచకుల శాఖలో బయటపడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల మోసం సంచలనంగా మారింది. పంచకుల మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో సుమారు 160 కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగినట్టు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. నకిలీ ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదులు సృష్టించడం, మున్సిపల్ కార్పొరేషన్ ఖాతా నుంచి నిధులను మళ్లించడం వంటి ఆరోపణలకు సంబంధించి విచారణ జరుగుతోంది (Kotak Bank fraud).


కొద్ది రోజుల క్రితం ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో కూడా ప్రభుత్వా ఖాతాల్లోని సొమ్ము మాయమైనట్టు బయటపడింది. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్ డిపాజట్లు ఎంత వరకు సురక్షితం అనే ప్రశ్న తలెత్తుతోంది. సాధారణ ప్రజలు ఎంతో మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లను సురక్షితంగా భావిస్తారు. ఎఫ్‌డీలలో పెట్టుబడులు పెడతారు. నిబంధనల ప్రకారం.. మనం ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాచుకునే డబ్బు ఎంత వరకు సురక్షితం (Bank deposits safety India)..


ఒక వ్యక్తి ఏదైనా బ్యాంక్‌లో ఎంత మొత్తమైనా ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాచుకోవచ్చు. ఎఫ్‌డీ చేసుకున్న డబ్బుకు సంబంధించి బ్యాంకు బీమా చేస్తుంది. ఈ బీమాను ఆర్‌బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) అందిస్తుంది. ఈ బీమా రూ.5 లక్షల వరకు ఉంటుంది. అంటే ఉదాహరణకు.. ఒక వ్యక్తి బ్యాంకులో రూ.10 లక్షలు ఎఫ్‌డీ చేశాడనుకుంటే.. ఒకవేళ ఆ బ్యాంకు దివాళా తీసినా, ఇంకేదైనా అవినీతి జరిగి మూసేసినా.. రూ.5 లక్షలు మాత్రమే వెనక్కి వస్తుంది. అంటే డిపాజిటర్ రూ.5 లక్షలు నష్టపోవాల్సి ఉంటుందన్నమాట (RBI rules deposits).


ప్రస్తుతం కోటక్ బ్యాంకు ఉదంతంలో డిపాజిటర్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే బ్యాంక్ ఎప్పటిలాగానే పని చేస్తుంది. బ్యాంక్ ఆ నష్టాన్ని పూరిస్తుంది. ఒకవేళ బ్యాంక్ దివాళా తీస్తే మాత్రం డీఐసీజీసీ, డిపాజిటర్‌కు రూ.5 లక్షలు బీమా కింద అందిస్తుంది. అంటే మీరు బ్యాంక్‌లో ఎంత సొమ్ము దాచుకున్నా.. ఐదు లక్షల వరకే ఆర్బీఐ బాధ్యత వహిస్తుందన్నమాట (DICGC insurance 5 lakh).


డిపాజిటర్‌గా మీరు ఏం చేయాలి..

బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో పెద్ద మొత్తాన్ని దాచుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి (Banking security). ముఖ్యంగా మీ డబ్బులన్నింటినీ ఒకే బ్యాంకులో దాచుకోవాలనుకోకూడదు. మీ దగ్గర డబ్బులను కొన్ని భాగాలు చేసి రెండు, మూడు బ్యాంకులలో దాచుకోవడం ఉత్తమం. పెద్ద మొత్తంలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను కాగితపు రసీదులతో కాకుండా, డిజిటల్ స్టేట్‌మెంట్‌ల ద్వారా ధ్రువీకరించుకోవాలి. ఖాతా కార్యకలాపాలను క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలి.


ఇవి కూడా చదవండి..

యుద్ధం ముగింపుపై ఆశలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..


పాకిస్థాన్ నౌకను వెనక్కి పంపించిన ఇరాన్.. హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి నిరాకరణ..

Updated Date - Mar 25 , 2026 | 06:14 PM