Share News

యుద్ధం ముగింపుపై ఆశలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:58 PM

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాటపట్టాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించాయి

యుద్ధం ముగింపుపై ఆశలు.. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..
Stock Market

ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నట్టు వస్తున్న వార్తలు స్టాక్ మార్కెట్లలో జోష్ నింపాయి. వరుసగా రెండో రోజు కూడా సూచీలు లాభాలు ఆర్జించాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర వంద డాలర్ల దిగువకు వచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాటపట్టాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలను ఆర్జించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (74,068)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 600 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 1800 పాయింట్లు లాభపడి 75,849 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 1205 పాయింట్ల లాభంతో 75,273 వద్ద రోజును ముగించింది. మళ్లీ 75 వేలకు పైన ముగిసింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 394 పాయింట్ల లాభంతో 23,306 వద్ద స్థిరపడింది. దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే కదలాడాయి (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో సమ్మన్ క్యాపిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, కేన్స్ టెక్నాలజీస్, కల్యాణ్ జువెల్లర్స్, పీఐ ఇండస్ట్రీస్ లాభాలు ఆర్జించాయి (share market news). టెక్ మహీంద్రా, ఆయిల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యునైటెడ్ స్పిరిట్స్, టీసీఎస్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1102 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1244 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.97గా ఉంది.


ఇవి కూడా చదవండి..

గ్యాస్ బుకింగ్‌కు 35 రోజుల విరామం.. నిజం కాదని ప్రకటించిన కేంద్రం..


పాకిస్థాన్ నౌకను వెనక్కి పంపించిన ఇరాన్.. హోర్ముజ్ గుండా ప్రయాణానికి అనుమతి నిరాకరణ..

Updated Date - Mar 25 , 2026 | 04:02 PM