Share News

సైబర్‌ మోసాలు.. వృద్ధుల నుంచి రూ.48లక్షలు కాజేత

ABN , Publish Date - Mar 20 , 2026 | 07:57 AM

నగరంలో సైబర్‌ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. షేక్‌పేటలో నల్లా బిల్లు చెల్లించాలని ఏపీకే ఫైల్‌తో రూ.5.51లక్షలు కాజేయగా.. ట్రేడింగ్‌ పేరుతో సికింద్రాబాద్‌లో ఓ వృద్దుడికి రూ.42.75లక్షలు శఠగోపం పెట్టాడు.

సైబర్‌ మోసాలు.. వృద్ధుల నుంచి రూ.48లక్షలు కాజేత

  • ట్రేడింగ్‌ పేరుతో రూ.42.75లక్షలు

  • ఏపీకే ఫైల్స్‌ పంపి రూ.5.51 లక్షలు..

హైదరాబాద్‌ సిటీ: నగరంలో సైబర్‌ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. షేక్‌పేటలో నల్లా బిల్లు చెల్లించాలని ఏపీకే ఫైల్‌తో రూ.5.51లక్షలు కాజేయగా.. ట్రేడింగ్‌ పేరుతో సికింద్రాబాద్‌లో ఓ వృద్దుడికి రూ.42.75లక్షలు శఠగోపం పెట్టాడు.

వివరాలిలా ఉన్నాయి.

  • షేక్‌పేట్‌ ప్రాంతానికి చెందిన వృద్ధుడు (70)కి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు మీ నల్లా బిల్లు పెండింగ్‌ ఉందని, వెంటనే చెల్లించకుంటే కనెక్షన్‌ కట్‌ చేస్తామని బెదిరించారు. ఆన్‌లైన్‌లో చెల్లించే వీలుందని బాధితుడి ఫోన్‌కు ఏపీకే లింక్‌ పంపారు. లింక్‌ ద్వారా వివరాలు నమోదు చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. తర్వాత ఆన్‌చేసి చూసిన బాధితుడికి పలు బ్యాంక్‌ ఖాతాల నుంచి రూ.5.51 లక్షలు వేర్వేరు ఖాతాలకు పంపినట్లు సందేశాలు వచ్చాయి. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.


city3.2.jpg

  • సికింద్రాబాద్‌(Secunderabad) ప్రాంతానికి చెందిన వృద్ధుడు (68) ఇన్‌ఫ్రా సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ‘మోతీలాల్‌ ఓస్వాల్‌’ భాగస్వామ్య సంస్థగా పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో ట్రేడింగ్‌లో ఎక్కువ లాభాలు వస్తాయని మభ్యపెట్టి పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు. వారు పంపిన లింక్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని మొదట రూ.50వేలు పెట్టుబడిగా పంపాడు. లాభం కలిపి రూ.75వేలుగా యాప్‌లో చూపించగా డబ్బును విత్‌డ్రా చేసుకున్నాడు. నమ్మకం వచ్చిన బాధితుడు ఆ తర్వాత సైబర్‌ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు పలు దఫాలుగా రూ. 42.75లక్షలు పంపాడు. పెద్ద మొత్తంలో లాభాలు వచ్చినట్లు యాప్‌లో చూపించినా విత్‌డ్రా కాలేదు. జీఎస్టీ, ట్యాక్స్‌, గ్యారెంటీ ఫీజు కలిపి రూ.29.35 లక్షలు చెల్లించాలని సైబర్‌ నేరగాళ్లు డిమాండ్‌ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆ కంటి మందుకు అనుమతుల్లేవు

అయ్యో.. రామచంద్రా..!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 20 , 2026 | 07:57 AM