Share News

భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

ABN , Publish Date - May 01 , 2026 | 07:15 AM

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి

భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
Commercial LPG Cylinder Price

ఢిల్లీ, మే1 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీలు వంటి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.


వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.993 పెంచింది. ఈ పెంపుతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ రేటు రూ.3,315కు చేరింది. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.3,071కి చేరుకుంది. ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు గతంలో రూ. 2,078.50 ఉండేవి. అదేవిధంగా, ముంబైలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు రూ.2,031 నుంచి రూ. 3,024కు పెరిగాయి. ఇక 5 కిలోల సిలిండర్ ధర రూ.914.50కి పెరిగింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను మూడుసార్లు పెంచింది కేంద్రం. మొదట మార్చిలో రూ.144 పెరగగా, ఏప్రిల్ 1న దాదాపు రూ.200 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరగడం, సరఫరా లోపాలు, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు వంటి అంశాలు ఈ పెంపునకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.


గృహ వినియోగదారులకు ఊరట..

వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగినా.. గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సాధారణ ప్రజలకు కొంత ఊరట లభించింది. గృహ వినియోగ సిలిండర్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.


పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు

ఇదిలా ఉండగా.. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు కూడా యథాతథంగా ఉన్నాయి. మరోవైపు, విమానయాన రంగానికి పెద్ద ఊరటనిస్తూ దేశీయ విమానయాన సంస్థలకు(షెడ్యూల్డ్ కార్యకలాపాలు) ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరల్లోనూ కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.


ఈ వార్తలు కూడా చదవండి...

సంక్షేమ పథకాల్లో సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేయాలి: సీఎం

పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 01 , 2026 | 07:52 AM