Share News

Sankranti Special Trains: పండుగకు రెండు ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:47 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ఏలూరు జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది..

Sankranti Special Trains: పండుగకు రెండు ప్రత్యేక రైళ్లు..
Sankranti Special Trains

ఏలూరు, జనవరి 13: సంక్రాంతి పండుగకు (Sankranti Festival) జిల్లా మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. చర్లపల్లి- కాకినాడ (07480) టౌన్ రైలును ఈ నెల19వ తేదీన నడపనున్నారు. చర్లపల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరి రాత్రి 9.30 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ టౌన్ - చర్లపల్లి (07481) రైలు ఈనెల 19వ తేదీన రాత్రి 11:15 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11:45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్ళు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.


విజయవాడ - విశాఖపట్నం మధ్య జనసాధన్..

విజయవాడ - విశాఖపట్నం మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా జనసాధన్ ప్రత్యేక రైళ్ళను (అన్ రిజర్వుడ్) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్టణం - విజయవాడకు (08567), విజయవాడ - విశాఖపట్నానికి (08568) జనవరి 13, 14, 16, 17, 18 తేదీలలో నడుపుతున్నట్లు తెలిపారు. ఈ రైళ్ళు విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, విజయవాడ స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

హైలెస్సొ..హైలెస్సా...

కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు రియాక్షన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 13 , 2026 | 12:11 PM