Share News

ఎన్నికల తీర్పుతో ప్రజలు జగన్‌కు రాజకీయ సమాధి కట్టారు: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:19 PM

స్థానిక సంస్థల విజయంతో జగన్‌కు ప్రజలు రాజకీయ సమాధి కట్టారని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

ఎన్నికల తీర్పుతో ప్రజలు జగన్‌కు రాజకీయ సమాధి కట్టారు: మంత్రి నిమ్మల
nimmala ramanaidu on kutami victory

పశ్చిమగోదావరి, నవంబర్ 8: పనిచేసే ప్రభుత్వాన్నే.. ప్రజలు మళ్లీ విశ్వసించి గెలిపించారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నికల్లో కూటమి గెలుపుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


‘పనిచేసే ప్రభుత్వంపై విశ్వాసంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. స్థానిక సంస్థల విజయంతో రాష్ట్రంలో త్రిబుల్ ఇంజన్ సర్కారు పాలన సాగనుంది. రాష్ట్ర అభివృద్ధి కూటమి హయాంలో కొనసాగనుంది. ప్రజా తీర్పుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజాసంక్షేమాన్ని పక్కకు నెట్టి స్వలాభం కోసం పనిచేసిన రఫా రఫా పార్టీని ప్రజలు వ్యతిరేకించారు. ప్రజలు ఆ పార్టీని బహిష్కరించే స్థితితో ఉన్నారు’ అని మంత్రి ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు

Updated Date - Nov 08 , 2026 | 04:31 PM