Share News

వైసీపీ కీలక నేత అరెస్ట్.. పోలీసులపై రప్పా రప్పా అంటూ రెచ్చిపోయిన ఆ పార్టీ శ్రేణులు

ABN , Publish Date - Sep 04 , 2026 | 09:13 PM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎమ్మార్ అప్పారావు కాలనీ ప్రధాన ముఖద్వారంపై కొలుసు పార్ధసారధి పేరు ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేకా ప్రతాప్ అప్పారావు ఆందోళన చేపట్టారు.

వైసీపీ కీలక నేత అరెస్ట్.. పోలీసులపై రప్పా రప్పా అంటూ రెచ్చిపోయిన ఆ  పార్టీ శ్రేణులు
Former YSRCP MLA Meka Pratap Apparao

ఏలూరు జిల్లా, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ఎమ్మార్ అప్పారావు కాలనీ ప్రధాన ముఖద్వారంపై కొలుసు పార్ధసారధి పేరు ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేకా ప్రతాప్ అప్పారావు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న ఆయనను అరెస్ట్ చేసి నూజివీడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులను అడ్డుకొని వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పోలీసులపై రప్పా రప్పా అంటూ ఆ పార్టీ శ్రేణులు రెచ్చిపోయారు. నూజివీడు పోలీసు స్టేషన్ వద్ద వైసీపీ శ్రేణులు హైడ్రామా సృష్టించారు. నూజివీడు డీఎస్పీ ప్రసాద్‌తో వాగ్వాదానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ దిగారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు బయటకు పంపించారు. స్టేషన్‌ను ముట్టడించి పోలీసులతో అనుచితంగా ప్రవర్తించిన వారిని గుర్తించి 35 మందిపై కేసులు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్‌ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్

గుంటూరు జిల్లా పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 09:31 PM