Share News

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సమస్యలను పరిష్కరిస్తాం: పురందేశ్వరి

ABN , Publish Date - Aug 28 , 2026 | 04:23 PM

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తామని బీజేపీ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ విశ్వవిద్యాలయంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మాటిచ్చారు.

పొట్టి శ్రీరాములు  తెలుగు  విశ్వవిద్యాలయ సమస్యలను పరిష్కరిస్తాం: పురందేశ్వరి
Daggubati Purandeswari

రాజమహేంద్రవరం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తామని బీజేపీ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) వ్యాఖ్యానించారు. ఈ విశ్వవిద్యాలయంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మాటిచ్చారు. ఈ విశ్వవిద్యాలయం 30 ఎకరాల విస్తీర్ణంలో ఉందని వెల్లడించారు. రాజమండ్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రూ.75 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల పనులకు ఈరోజు (శుక్రవారం) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైస్ ఛాన్స్‌లర్ మునిరత్నం నాయుడు పాల్గొన్నారు.


ఏపీ విభజన వల్ల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అన్యాయం: గోరంట్ల

Gorantla.jpg

ఏపీ విభజన వల్ల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ విశ్వవిద్యాలయం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అంశంపై ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించామని చెప్పారు. తమ ప్రభుత్వం విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ

నేపాల్ వరదలు.. ఏపీ వాసులు గల్లంతు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 04:43 PM