బొత్స చైతన్యపై జనసేన ఫిర్యాదు.. జెడ్పీటీసీ నామినేషన్‌పై అభ్యంతరం
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:43 PM
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొత్స చైతన్యపై ఎన్నికల అధికారికి జనసేన ఫిర్యాదు చేసింది. బొత్స చైతన్యపై చర్యలు తీసుకోవాలని జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి కోట్ల రేవతి కోరారు.
విజయనగరం, అక్టోబర్ 24: పూసపాటిరేగ మండలం వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొత్స చైతన్యపై ఎన్నికల అధికారికి జనసేన ఫిర్యాదు చేసింది. బొత్స చైతన్యపై చర్యలు తీసుకోవాలని జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి కోట్ల రేవతి కోరారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ వార్డులో బొత్స చైతన్యకు ఓటు హక్కు ఉందంటూ ఫిర్యాదు చేశారు. UJK1667229 ఓటర్ ఐడీతో విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు ఉన్నట్లు ఎన్నికల అధికారికి రేవతి వివరించారు.
అక్టోబర్ 22వ తేదీ వరకు 41వ వార్డులో ఓటు హక్కు కలిగి ఉన్న వ్యక్తి.. పూసపాటిరేగ మండలం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎలా నామినేషన్ దాఖలు చేస్తారంటూ జనసేన అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు ఉన్న నేపథ్యంలో పూసపాటిరేగ మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం బొత్స చైతన్యపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని జనసేన అభ్యర్థి కోట్ల రేవతి కోరారు.
ఇవి కూడా చదవండి..
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ.. పార్టీల వారీగా వివరాలివే
అల్లూరి జిల్లాలో పేలుడు ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా.. ఐదుగురి మృతిపై విచారణకు ఆదేశం
Read Latest AP News And Telugu News