Share News

అల్లూరి జిల్లాలో పేలుడు ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా.. ఐదుగురి మృతిపై విచారణకు ఆదేశం

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:20 PM

ఏఎస్ఆర్ జిల్లాలో పేలుడు ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట సమీపంలో వాహనంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందిన ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు.

అల్లూరి జిల్లాలో పేలుడు ఘటనపై పవన్ కల్యాణ్ ఆరా.. ఐదుగురి మృతిపై విచారణకు ఆదేశం
Deputy CM Pawan Kalyan

అమరావతి, అక్టోబర్ 24: ఏఎస్ఆర్ జిల్లాలో పేలుడు ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట సమీపంలో వాహనంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందిన ఘటనపై పవన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వాహనంలో పేలుడుకు గల కారణాలను ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్‌ని అడిగి వివరాలు తెలుసుకున్నారు.


అభివృద్ధి పనుల నిమిత్తం టిప్పర్ వాహనంలో డీజిల్ తరలిస్తున్న సమయంలో మరో వాహనాన్ని ఢీ కొట్టడం కారణంగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు డిప్యూటీ సీఎంకు కలెక్టర్ వివరించారు. పేలుడు ధాటికి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. దీనిపై పవన్ స్పందిస్తూ పేలుడుకు గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ.. పార్టీల వారీగా వివరాలివే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 12:20 PM