Share News

ఆంధ్రప్రదేశ్‌ను కార్పొరేట్ హోంగా మార్చుకోండి: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:25 PM

ఆంధ్రప్రదేశ్‌ను కార్పొరేట్ హోంగా మార్చుకోవాలని ఏపీ విద్య, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేశ్ సూచించారు. ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్‌కు వాస్తవ రూపమిస్తామని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌ను కార్పొరేట్ హోంగా మార్చుకోండి: మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను కార్పొరేట్ హోంగా మార్చుకోవాలని ఏపీ విద్య, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖ‌ల‌ మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) సూచించారు. ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్‌కు వాస్తవ రూపమిస్తామని వ్యాఖ్యానించారు. విశాఖపట్నానికి పరిశ్రమలు క్యూకడుతున్నాయని తెలిపారు. విశాఖపట్నంలోని సీఐఐ సదస్సులో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ఉంటామని భరోసా కల్పించారు. వారితో కలిసి పనిచేయడానికి తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తల సొంత టీములకంటే తమ ప్రభుత్వం వేగంగా స్పందిస్తుందని పేర్కొన్నారు


రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి..

ఏపీలో సుదీర్ఘ తీరప్రాంతం ఉందని మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టులకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. పర్యాటకంగా అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఈ సదస్సు ద్వారా రూ.12లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈ సదస్సు ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.


విశాఖ సమీపంలో సెమీకండక్టర్ పరిశ్రమ..

విశాఖపట్నం సమీపంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కాబోతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఏపీలో కనెక్టివిటీ ఎంతో ఉపయోగకరంగా ఉందని వెల్లడించారు. అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ఏపీని మీ సొంత ప్రాంతంగా భావించి పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.


ఈరోజు (గురువారం) విశాఖపట్నంలో అట్టహాసంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు - 2026 ప్రారంభమైంది. 'నేవిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్' థీమ్‌తో మొదటి రోజు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు లోకేశ్, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సుకు 58 దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులు తరలివచ్చారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్యంగా ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీపై సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు

తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం: మంత్రి గొట్టిపాటి

పీఆర్పీ.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 02:18 PM