Share News

తెలుగు వైభవం కళ్లకు కట్టాలి

ABN , Publish Date - Aug 01 , 2026 | 07:47 AM

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం, ప్రధాని నరేంద్రమోదీ రాకకు చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్న ఆయన, పోర్టు గెస్ట్‌హౌ్‌సలో బస చేశారు. అక్కడే మంత్రులు, జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు.

తెలుగు వైభవం కళ్లకు కట్టాలి

  • ప్రధాని రాక, విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్ష

విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం, ప్రధాని నరేంద్రమోదీ రాకకు చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్న ఆయన, పోర్టు గెస్ట్‌హౌ్‌సలో బస చేశారు. అక్కడే మంత్రులు, జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ఉండాలన్నారు. ప్రాంగణాన్ని తెలుగు సంస్కృతి, వారసత్వ వైభవం ఉట్టి పడేలా తీర్చిదిద్దాలన్నారు. గిరిజన సంప్రదాయ నృత్యం ఽథింసా ఆకట్టుకోవాలని సీఎం సూచించారు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కుమార్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, నేరుగా చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఐ అండ్‌ పీఆర్‌ డైరెక్టర్‌ విశ్వనాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 07:48 AM