విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. కార్మికుడి మృతి
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:35 AM
విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. కోక్ ఓవెన్ బ్యాటరీ-1లో పడి కార్మికుడు మృతిచెందాడు. మృతుడు జార్ఖండ్‌కు చెందిన సంజీవ్ కుమార్ సింగ్‌గా గుర్తించారు.
విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. కోక్ ఓవెన్ బ్యాటరీ-1లో పడి కార్మికుడు మృతిచెందాడు. మృతుడు జార్ఖండ్‌కు చెందిన సంజీవ్ కుమార్ సింగ్‌గా గుర్తించారు. ఫోస్బెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అతను మెకానికల్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
కోక్ ఓవెన్ బ్యాటరీలోని 222, 223 ఓవెన్లను పరిశీలించి తిరిగి వస్తుండగా... ప్రమాదవశాత్తు 226వ ఓవెన్లో సంజీవ్ కుమార్ సింగ్ పడిపోయాడు. కాలిపోయిన స్థితిలో ఉన్న అతని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్తం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంజీవ్ కుమార్ సింగ్ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News