Share News

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు: ఎంపీ శ్రీభరత్

ABN , Publish Date - Sep 04 , 2026 | 09:40 PM

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మెయింటెనెన్స్ లోపంతో జరుగుతున్న ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యానించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు: ఎంపీ శ్రీభరత్
Visakhapatnam MP Sri Bharat

విశాఖపట్నం, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మెయింటెనెన్స్ లోపంతో జరుగుతున్న ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ (Visakhapatnam MP Sri Bharat) వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఎండీ ప్రభాకర్‌తో ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈరోజు (శుక్రవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడారు. లాభదాయకంగా స్టీల్ ప్లాంట్‌ను కొనసాగించే ప్రయత్నం చేసే దిశగా అధికారులతో సమీక్షించామని పేర్కొన్నారు.


మార్కెట్‌లో స్టీల్ ఉక్కు డిమాండ్‌ను సరితూగే విధంగా వినియోగదారులకు ధర అందుబాటులో ఉందా లేదా అని పరిశీలిస్తున్నామని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. హెచ్‌పీ కాలనీ, ఆటోనగర్‌లో స్టీల్ ప్లాంట్ కమర్షియల్ భూములను ఈ వేలం ద్వారా అమ్మకాన్ని పెట్టడంపై తనకు స్పష్టత లేదని చెప్పారు. సీఐఎస్ఎఫ్ బలగాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందనే అపోహలు నమ్మొద్దని అన్నారు. ఈ విషయంపై పూర్తి స్పష్టత త్వరలో ఇస్తామని వెల్లడించారు. పదేళ్లగా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయిందని అన్నారు. సుమారు 35 వేల కోట్ల అప్పులో ఉందని.. అప్పుల భారం నుంచి బయట పడటానికి కొంత సమయం పడుతుందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.


స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం: పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasa Rao

సుదీర్ఘకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఆధార్ కార్డ్ బ్లాక్ సిస్టం తొలగించాలని చెప్పారు. మెయింటెనెన్స్ ఉద్యోగాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. స్టీల్ ప్లాంట్ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంపై విశాఖ ఉక్కు సీఎండీ ప్రభాకర్ సానుకూలంగా స్పందించారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్‌ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు

చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్

గుంటూరు జిల్లా పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 10:15 PM