విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది: పీవీఎన్ మాధవ్
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:52 PM
జార్ఖండ్‌లో జరిగిన SSC పరీక్షలో అవకతవకలు జరిగినట్లు తేలిందని.. ఈ క్రమంలోనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. వారిపైనా రబ్బర్ బుల్లెట్స్, లాఠీఛార్జి చేశారన్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 11: జార్ఖండ్‌లో SSC పరీక్షలో అవకతవకలు జరిగినట్లు తేలిందని.. ఈ క్రమంలోనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. వారిపైనా రబ్బర్ బుల్లెట్స్, లాఠీఛార్జి చేశారన్నారు. JJM, కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ నడుస్తోందని చెప్పారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తెలిసిన వెంటనే పరీక్ష రద్దు చేశామని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేశారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే అని చెప్పుకొచ్చారు.
జార్ఖండ్‌లో ఎస్‌ఎస్‌సీ పేపర్ లీక్ వల్ల ఎంతో మంది యువత జీవితం రోడ్డుపాలవుతోందని మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. కేంద్రంలో తప్పు జరిగిందని.. వెంటనే దాన్ని కరెక్ట్ చేశామని అన్నారు. రాహుల్ గాంధీ పిరికివారని.. అందుకే పార్లమెంట్‌కు రాకుండా పారిపోతున్నారని విమర్శించారు. పేపర్ లీక్‌పై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలపై జగన్, షర్మిల ముందుకు రావాలన్నారు. వైసీపీ దిక్కుతోచని స్థితిలో ఉందంటూ వ్యాఖ్యానించారు. డీఎస్సీ పూర్తి పారదర్శకంగా జరిగిందని.. ఏం చేయాలో తెలియక వైసీపీ కావాలని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
క్రీడా కోటాలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు అన్నారు. వైసీపీ చేస్తున్న నిరసనలను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో చేసినట్లు, తమ జీవితాలను నాశనం చేయొద్దని ఉద్యోగులు కూడా ఆందోళన చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని.. విశాఖలో అత్యధిక స్థానాల్లో కూటమి ప్రభుత్వం గెలుస్తుందని పీవీఎన్ మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై కేసు నమోదు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
Read Latest AP News And Telugu News