Home » Paper Leakage
జార్ఖండ్‌లో జరిగిన SSC పరీక్షలో అవకతవకలు జరిగినట్లు తేలిందని.. ఈ క్రమంలోనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. వారిపైనా రబ్బర్ బుల్లెట్స్, లాఠీఛార్జి చేశారన్నారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. పంజాబ్‌లో జరుగుతున్న పేపర్ లీక్ ఘటనలను నిరసిస్తూ కమలం పార్టీ నేతలు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ (సోమవారం) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌కు ముందు ప్రముఖ సామాజిక కార్యకర్త సోమన్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. 20 రోజులకు పైగా తాను చేస్తున్న నిరాహార దీక్షను ఈరోజు విరమిస్తానని ఆయన ప్రకటించారు. అయితే, తాను ప్రతిపాదించిన మూడు షరతులు నెరవేరితేనే నిరశన దీక్షను విరమిస్తానని తెలిపారు.
భారత విద్యా వ్యవస్థపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ విద్యా వ్యవస్థ ప్రస్తుతం నిజాయతీ లేని దోపిడీ యంత్రాంగంగా మారిందని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఎంపీ రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ పరీక్షలకు సంబంధించిన ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ అధికారుల దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు. పేపర్ లీక్ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు వరుసగా పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు.
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని.. తన డిబార్‌ను రద్దు చేసి పరీక్షలు రాజే అవకాశం కల్పించాలని కోరుతూ విద్యార్థిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం పేపర్ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది.
వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం ప్రత్యక్షమైన ఘటనలో విద్యార్థిని డీబార్ చేయగా, ఆమె చేసిన వ్యాఖ్యలు పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో ముగ్గురు నిందితులను పెదకాకాని పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.