Share News

నీట్ పేపర్ లీక్ కేసు.. మహిళను అదుపులోకి తీసుకున్న సీబీఐ..

ABN , Publish Date - May 13 , 2026 | 03:55 PM

నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు. పేపర్ లీక్ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు వరుసగా పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు.

నీట్ పేపర్ లీక్ కేసు.. మహిళను అదుపులోకి తీసుకున్న సీబీఐ..
NEET Paper Leak Issue

మహారాష్ట్ర: నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) అధికారులు దూకుడు పెంచారు. పేపర్ లీక్ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు వరుసగా పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈరోజు (బుధవారం) ఉదయం రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్, దినేశ్‌ను అదుపులోకి తీసుకోగా.. తాజాగా పుణెకు చెందిన ఓ మహిళను విచారణ నిమిత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


ఈ కేసుతో సదరు మహిళకు సంబంధం ఉందని అనుమానించిన పుణె పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని సీబీఐకి అప్పగించారు. నిందితురాలిని బిబ్వేవాడి ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. తాము విచారించిన అనంతరం సీబీఐ అధికారులకు అప్పగించామని చెప్పారు. అయితే, ఈ కేసులో ఆమె కచ్చితమైన పాత్రను వివరించేందుకు కమిషనర్ నిరాకరించారు. కాగా, అండర్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు.


ఈ పరీక్ష రాసేందుకు 23 లక్షల మంది నమోదు చేసుకోగా, 96.92 శాతం మంది హాజరయ్యారు. పరీక్ష రద్దు కావడంతో 23 లక్షల మంది విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పేపర్ లీక్ ఘటనపై పలు విద్యార్థి సంఘాలు మండిపడుతూ ఆందోళనకు దిగుతున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి ప్రమాణస్వీకారం..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతులు, రైల్వేలు, పరిశ్రమలకు భారీ ఊతం

Updated Date - May 13 , 2026 | 03:55 PM