లోకేశ్ ఆదేశాలు.. థాయ్‌లాండ్‌లో విద్యార్థులతో మాట్లాడిన ఏపీ భవన్ అధికారులు
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:58 AM
థాయ్‌లాండ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులతో ఏపీ భవన్ అధికారులు మాట్లాడారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు విద్యార్థుల పరిస్థితిపై అధికారులు ఆరా తీశారు. ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అవసరమైన సహాయంపై వివరాలు సేకరించారు.
అమరావతి, ఆగస్టు 11: థాయ్‌లాండ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులతో ఏపీ భవన్ అధికారులు మాట్లాడారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు విద్యార్థుల పరిస్థితిపై అధికారులు ఆరా తీశారు. ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అవసరమైన సహాయంపై వివరాలు సేకరించారు. విద్యార్థుల పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని థాయ్‌లాండ్‌లోని భారత రాయబారికి పంపించారు. థాయ్‌లాండ్‌లో స్థానిక కరెన్సీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ఏపీ భవన్ అధికారులు తెలిపారు.
విద్యార్థులకు సహాయం అందేలా తక్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు సూచనలు ఇవ్వాలని భారత రాయబారిని అధికారులు కోరారు. అలాగే విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, వారిని సురక్షితంగా దేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
కస్టమర్‌కు ఊహించని షాక్.. సమోసాలో బొద్దింక..
భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News