కస్టమర్‌కు ఊహించని షాక్.. సమోసాలో బొద్దింక..
ABN , Publish Date - Aug 11 , 2026 | 07:58 AM
సమోసా తింటుండగా ఓ కస్టమర్‌కు ఊహించని షాక్ తగిలింది. సమోసాలో బొద్దింక బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్ చీఫ్ మినిష్టర్స్ హెల్ప్‌లైన్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: సమోసా తింటుండగా ఓ కస్టమర్‌కు ఊహించని షాక్ తగిలింది. సమోసాలో బొద్దింక బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన కస్టమర్ చీఫ్ మినిష్టర్స్ హెల్ప్‌లైన్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండోర్‌కు చెందిన పియూశ్ మౌర్య అనే వ్యక్తి సోమవారం చిక్‌మంగ్లూర్ స్క్వయర్‌లోని ఓ తినుబండారాల షాపునకు వెళ్లాడు.
ఓ సమోసా ఆర్డర్ చేసుకుని తినటం మొదలెట్టాడు. సగం తిన్న తర్వాత సమోసాలో బొద్దింక బయటపడింది. దీంతో పియూశ్ షాక్ అయ్యాడు. సమోసాలో బొద్దింక రావటంపై షాపు యజమానిని ప్రశ్నించాడు. ‘ఆ బొద్దింక పొరపాటున సమోసాలోకి చొరబడి ఉంటుంది. నువ్వు కావాలంటే వీడియో రికార్డు చేసుకో. తప్పు జరిగిపోయింది. అది కావాలని చేసింది కాదు’ అని అన్నాడు. ఇద్దరి మధ్యా కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది.
యజమాని తీరుపై ఆగ్రహానికి గురైన పియూశ్ చీఫ్ మినిష్టర్స్ హెల్ప్‌లైన్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ షాపులో తనిఖీలు చేశారు. సమోసా, చట్నీ, నీటి శాంపిల్స్ సేకరించి టెస్టింగ్‌కు పంపారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: పావురాలు.. కోతుల బెడదకు చెక్ పెట్టేలా.. !
మాతాశిశువుకు భరోసా.. నేడు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..