Share News

కాల్వలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి గల్లంతు

ABN , Publish Date - Aug 11 , 2026 | 08:53 AM

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర అడవి కోడి కాల్వ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలువలో ఆ ప్రేమ జంట దూకింది.

కాల్వలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి గల్లంతు

భీమవరం, ఆగస్టు 11: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర అడవి కోడి కాల్వ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలువలో ఆ ప్రేమ జంట దూకింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో.. ఆ జంట కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే కాలవలోకి దూకి యువకుడిని కాపాడారు. యువతి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీనిపై స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.


యువతి కోసం వారంతా గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన సందీప్ కుమార్, భీమవరంకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఈ ఆత్మహత్యయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కిడ్నాపైన విద్యార్థి సురక్షితం.. పోలీసుల అదుపులో కిడ్నాపర్లు

యువతి మృతి, యువకుడి పరిస్థితి విషమం.. గామన్ బ్రిడ్జ్ వద్ద కలకలం

For More AP News And Telugu News

Updated Date - Aug 11 , 2026 | 09:00 AM